సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ళ మండలం లంకెల కూరపాడులో ఎమ్మార్వో కె. నగేష్ ఆధ్వర్యంలో గురువారం రీసర్వే అనంతరం 759 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. దేచారంలో 238 పుస్తకాలు పంచారు. ఏప్రిల్ 9 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, అర్హులైన రైతులు కేవైసీ చేయించుకుని పాస్ పుస్తకాలు తీసుకోవాలని ఎమ్మార్వో తెలిపారు.