లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు, ముగ్గురికి గాయాలు

పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చల్లగుండ్ల సెంటర్ వద్ద సోమవారం తెల్లవారుజామున ప్రైవేట్ బస్సు లారీని ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనలో లారీ క్లీనర్ రవి (24), బస్సు ప్రయాణికుడు జాహిత్ (30), లారీ డ్రైవర్ కనకరాజు (49) గాయపడ్డారు. వారిని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్