గురువారం సత్తెనపల్లి మండలం మాదల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. నరసరావుపేట నుంచి ఉల్లిగడ్డల లోడ్తో వస్తున్న ఆటోను వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రోడ్డు దాటుతున్న మరో లారీని తప్పించబోయే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆటో సమీపంలో ఉన్న కారులోని వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి.