మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, పొన్నూరు వైసీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళీ శుక్రవారం విచారణ నిమిత్తం సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ కు హాజరయ్యారు. అనంతరం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, లోకేశ్ చెప్పినట్లు వైసీపీ నాయకులపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. మీ ఉడత ఊపులకు బెదిరేది లేదని, కేసులు కొత్త కాదని అంబటి అన్నారు.