శుక్రవారం సత్తెనపల్లి మండలం హెన్నా దేవి సమీపంలో కారు, బైక్ ఢీకొన్న ఘటనలో బైక్పై ఉన్న కె. సత్యనారాయణ (37) అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, బాధితుడు పాకాలపాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.