గత వైసీపీ ప్రభుత్వ పాలనలో అధికార దుర్వినియోగం, అరాచక రాజకీయాలు పరాకాష్టకు చేరాయని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఆదివారం సత్తెనపల్లిలో టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతల ప్రవర్తనను అసహ్యించుకునే ప్రజలు కూటమిని గెలిపించారని పేర్కొన్నారు. తమపై బ్లాక్మెయిల్ రాజకీయాలు సాగవని, అక్రమాలకు భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.