ఎరువుల డీలర్లకు కీలక సూచనలు చేసిన ఏడీఏ

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలో ఎరువుల డీలర్లతో గురువారం నిర్వహించిన సమావేశంలో గుంటూరు ఏడీఏ ఎన్. మోహన్‌రావు కీలక సూచనలు చేశారు. ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్-1985 ప్రకారం లైసెన్స్ ఉన్న డీలర్లు మాత్రమే ఎమ్మార్పీ ధరలకు ఎరువులు విక్రయించాలని తెలిపారు. బ్లాక్ మార్కెటింగ్, లింక్ ప్రొడక్ట్స్ విక్రయాలు నిషేధమని హెచ్చరిస్తూ రైతులకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని, స్టాక్ రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్