రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ సూచనల మేరకు ఫిరంగిపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను శనివారం ఒకరోజు ముందుగానే పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని ఈ కార్యక్రమం నిరూపించింది. ఈ పంపిణీలో గుంటూరు పార్లమెంట్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి యనమాల ప్రకాష్, కార్యనిర్వాహ కార్యదర్శి తెనాలి రాజు, మండల టీడీపీ నాయకులు గుడిపూడి వెంళాగిణి రాజు, యూనిటీ ఇన్‌చార్జ్ తెనాలి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.