అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలి: టీడీపీ నాయకులు

ఫిరంగిపురం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాజకీయ విమర్శల పేరుతో వ్యక్తిగత దూషణలకు దిగడం అంబటి రాంబాబు దిగజారిన రాజకీయ ధోరణికి నిదర్శనమని వారు ఆదివారం ఫిరంగిపురం టిడిపి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మండిపడ్డారు. ఇకపై ఎవరైనా ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా దూషిస్తే గట్టి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడిపై చేసిన వ్యాఖ్యలకు అంబటి రాంబాబు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా టిడిపి శ్రేణులు ఉద్యమాలకు సిద్ధమవుతాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్