తాడికొండ/ఫిరంగిపురం: మెరికపూడి ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం జరిగింది. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఎన్. వెంకట్ లక్ష్మి మాట్లాడుతూ, మంచి జీవన విధానం, ఆహారంతో క్యాన్సర్‌ను దరిచేరకుండా చూసుకోవచ్చని, ముందస్తు పరీక్షలు, సరైన సమయంలో చికిత్సతో వ్యాధిని నివారించవచ్చని తెలిపారు. యువత ధూమపానం, పొగాకు వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.