మార్టూరులో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహణ

మార్టూరు ఆది జాంబవ కాలనీలో ఆదివారం పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్‌ను నిర్వహించారు. డీఎస్పీ చంద్రమౌళి, సీఐ శ్రీనివాసరావు పర్యవేక్షణలో జరిగిన ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై నిఘా కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.

సంబంధిత పోస్ట్