శనివారం మేడికొండూరు (M) పాలడుగు అడ్డరోడ్డు వద్ద హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. విజయవాడకు చెందిన దివ్యాంగుడు సునీల్‌కుమార్ (43) తన తల్లి విజయలలితతో కలిసి మూడు చక్రాల బండిపై సత్తెనపల్లి వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సునీల్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా, అతని తల్లి గాయపడ్డారు. ఎస్ఐ ఖాజీబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.