తాడికొండ/ఫిరంగిపురం: మునగపాడు గ్రామంలో శుక్రవారం జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్యపర్యవేక్షకులు కొండపల్లి సుదర్శన్ రాజు మాట్లాడుతూ, చర్మంపై స్పర్శ లేని మచ్చలు, చేతుల నుండి వస్తువులు జారిపోవడం, ముక్కులో నుంచి రక్తం కారడం, చేతి, కాలి వేళ్లు వంకర తిరిగి అంగవైకల్యం రావడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆశా కార్యకర్తలకు చూపించుకోవాలని సూచించారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ, ఆరోగ్య కార్యకర్తల వద్ద ఎం.డి.టి. మందులు ఉచితంగా లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీహెచ్‌ఓ లింగరాజు, ఏఎన్ఎం అరుణ, ఆశా కార్యకర్తలు రమణ, అరుణ, టీడీపీ నాయకులు రమణయ్య, మౌలాలి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.