గంజాయి స్మగ్లర్‌పై PIT-NDPS చట్టం కింద నిర్బంధం..

తుళ్లూరు మండలం ఐనవోలు గ్రామానికి చెందిన నరేశ్ (21) గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న నేపథ్యంలో, జిల్లా పోలీసుల ప్రతిపాదన మేరకు రాష్ట్ర ప్రభుత్వం PIT-NDPS చట్టం కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసింది. నిందితుడిపై విశాఖపట్నం, తుళ్లూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో మూడు గంజాయి కేసులు నమోదయ్యాయి. విద్యాసంస్థల పరిసరాల్లో యువతను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయిస్తున్నట్లు గుర్తించిన అధికారులు, ప్రజా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఈ చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నరేశ్‌ను రాజమండ్రి సెంట్రల్ జైలులో నిర్బంధించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్