పాలడుగు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ వీరయ్య ఇంట్లో దొంగతనం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున ఇంటి తాళం పగలగొట్టి, బీరువాలోని 56 గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి, రూ. 40 వేల నగదు దొంగిలించబడ్డాయి. సంఘటనా స్థలాన్ని వేలిముద్రల నిపుణులు, జిల్లా సీసీఎస్ పోలీసులు పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.