కంకర లోడు లారీల రాకపోకలతో విపరీతమైన దుమ్ము వస్తోందని, దీని వల్ల ఇబ్బందులు పడుతున్నామని పేరేచర్ల తెల్లక్వారీ కాలనీ వాసులు ఆదివారం సాయంత్రం ఆందోళనకు దిగారు. రోడ్డుకు అడ్డంగా చెట్టు కొమ్మnలు ఉంచి నిరసన తెలిపారు. మేడికొండూరు సీఐ నాగూర్ మీరా సాహెబ్ సిబ్బందితో కలిసి కాలనీవాసులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఆందోళనకారులకు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించేశారు.