మేడికొండూరు గ్రామంలో శుక్రవారం ఎన్టీఆర్ భరోసా పథకం కింద స్పౌస్ పెన్షన్ మంజూరు చేయడం జరిగింది. భర్త మరణించిన వెంటనే భార్యకు పెన్షన్ మంజూరు చేయడం ఈ కొత్త పథకంలోని ప్రధాన ఆకర్షణ. ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ అందజేయడం జరుగుతోంది. మంచి పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజల మద్దతు పెరుగుతోంది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాములపాటి శివ మరియు యలమంద పాల్గొని కార్యక్రమాన్ని ఘనవిజయంగా నిర్వహించారు.