తాడికొండలో అనుమానాస్పద మృతి

తాడికొండ గ్రామంలో కనగాల శ్రావంతి (45) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ఆమె కుమారుడు వడ్డే భార్గవ్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, వివాహం తర్వాత భర్త పూర్ణ చంద్రరావు, అతని కుటుంబ సభ్యులు శ్రావంతిని వేధిస్తున్నారని ఆరోపించారు. ఘటన రోజున తల్లి ఫోన్‌లో వేధింపుల గురించి చెప్పిన కొద్దిసేపటికే ఆమె పడిపోయిందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని భార్గవ్ పేర్కొన్నారు. ఈ ఘటనపై తాడికొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్