బుధవారం ఉదయం నుంచి కొండవీటి వాగు ఉగ్రరూపం దాల్చింది. తుఫాన్ తాకిడికి కురిసిన భారీ వర్షాల కారణంగా వాగు ప్రవాహం పెరిగింది. దీంతో పాములపాడుగ్రామంలోని పంట పొలాలు, ఇళ్లు నీట మునిగాయి. అధికారులు, ప్రజలు అప్రమత్తమయ్యారు. వాగు రోడ్డుపై ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.