నిద్ర మత్తులో నిర్లక్ష్యంతో కారు నడిపి, ఎదురుగా వస్తున్న బైక్ లను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తాడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ప్రమాదంలో అనంతవరం గ్రామానికి చెందిన ఆరేపల్లి జోజి, ఎస్. సాంబయ్య(40), మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ సాంబయ్య మృతి చెందినట్లు తెలిపారు. జోజి ఫిర్యాదు మేరకు తాడికొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.