తాడికొండ: 7న లాం చలపతి కళాశాలలో ఉద్యోగ మేళా

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 7న తాడికొండ మండలం లాంలోని చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీ రింగ్ అండ్ టెక్నాలజీలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా తెలిపారు. శనివారం ఉద్యోగ మేళా పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడిన ఆయన, సుమారు 30కి పైగా కంపెనీల ప్రతినిధులు హాజరై అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేసుకుంటారని పేర్కొన్నారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్