తాడికొండ: వాహనం ఢీకొని తాపీమేస్త్రికి తీవ్ర గాయాలు

అక్టోబర్ 27న రాత్రి పొన్నెకల్లు గ్రామానికి చెందిన తాపీమేస్త్రి షేక్ మౌలాలిని రావెల గ్రామ శివారులో గుర్తుతెలియని వాహనం అతివేగంతో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన మౌలాలిని స్థానికులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని మౌలాలి భార్య షేక్ అనూష బేగం శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్