తాడికొండ: హత్య కేసు నిందితులకు రిమాండ్

తాడికొండ గ్రామ శివారులోని దుర్గా వైన్ షాపులో ఈ నెల 5న జరిగిన వివాదంలో నూతక్కి మరియదాసు (35) దారుణ హత్యకు గురయ్యారు. స్నేహితుడు నూతక్కి నరేష్‌తో నెలకొన్న వివాదం నేపథ్యంలో, నరేష్ మేనల్లుడు కటారి కిరణ్ అలియాస్ జాషువాతి తన స్నేహితులైన గాజులవర్తి సాంబశివరావు, నూతక్కి సాంబశివరావులతో కలిసి మరియదాసుపై సిమెంట్ రాయితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందారు. తాడికొండ సీఐ వాసు కేసు నమోదు చేసి, నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, పరారీలో ఉన్న మిగతా ఇద్దరిని మంగళవారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్