తాడికొండ: గంజాయి, మద్యం మత్తులో ఇళ్లలోకి చొరబడి హల్‌చల్

తాడికొండలో గంజాయి, మద్యం మత్తులో ఇళ్లలోకి చొరబడి హల్‌చల్ చేసిన రౌడీషీటర్ షేక్ రియాజ్‌ను స్థానికులు పట్టుకుని చితకబాదారు. గ్రామస్థుల నుంచి తప్పించుకునేందుకు పోలీస్ క్వార్టర్స్‌లో దాక్కున్నప్పటికీ అతడు పట్టుబడ్డాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన రియాజ్ ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. అతడు తరచూ దొంగతనాలు, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సమాచారం.

సంబంధిత పోస్ట్