తాడికొండ మండలంలోని ఓ గ్రామంలో కొడుకు తండ్రి గొంతు నులిమి హత్య చేసాడు. ఈపూరు మండలం పొనుగోటివారిపాలెంలో కోళ్లఫారంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్న వేల్పూరి శివయ్య(57)కు భార్య, కుమారుడు సరేంద్ర, కుమార్తె ఉండగా వివాదాలతో వేరుగా ఉంటూ అప్పుడప్పుడు భార్య పిల్లల దగ్గరికి వస్తూ ఉంటాడు. 1.40 ఎకరాల భూమిపై కుమారుడు ఒత్తిడి చేయడంతో జూలై 9న గ్రామానికి వచ్చిన సమయంలో వాగ్వాదం జరిగి అదే రాత్రి నిద్రలో ఉన్న శివయ్యను గొంతు నులిమి చంపాడు. సోమవారం న్యాయమూర్తి రిమాండ్ విధించారు.