తుళ్లూరు: అక్రమ నల్లమట్టి రవాణా.. 7 లారీలు స్వాధీనం

అమరావతి రాజధాని ప్రాంతంలో అనుమతులు లేకుండా నల్లమట్టిని తరలిస్తున్న 7 టిప్పర్లను తుళ్లూరు పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. కృష్ణాయపాలెంలో అమరావతి నిర్మాణ పనుల నుంచి తవ్విన నల్లమట్టిని ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి వైపు తరలిస్తుండగా ఎస్ఐ కలగయ్య వాహనాలను అడ్డుకున్నారు. ఈ ఘటనపై 7 టిప్పర్లు, 7 మంది డ్రైవర్లు, 7 మంది యజమానులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ కె. శ్రీనివాసరావు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్