తుళ్లూరు: 47 రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు

ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన ఉండవల్లి గ్రామానికి చెందిన 30 మంది రైతులకు శుక్రవారం రాయపూడి సమీపంలోని ఏపీ సీఆర్డీఏ కార్యాలయంలో ప్లాట్లు కేటాయించారు. మొత్తం 47 రిటర్నబుల్ ప్లాట్లను ర్యాండం సిస్టం ద్వారా ఈ-లాటరీ విధానంలో కేటాయించగా, వీటిలో 25 నివాస, 22 వాణిజ్య ప్లాట్లు ఉన్నాయి. ప్లాట్లు పొందిన రైతులకు అధికారులు ప్రొవిజినల్ సర్టిఫికెట్లు అందించారు.

సంబంధిత పోస్ట్