తుళ్లూరు: హజ్ యాత్ర -2026 కు దరఖాస్తు గడువు పెంపు

హజ్ యాత్ర కోసం హజ్ కమిటీ ఆఫ్ ఇండియా హజ్-2026 కు ఆన్లైన్ దరఖాస్తు నమోదు గడువు ను ఆగస్టు 7 వ తేదీ వరకు పొడిగించినట్లు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అమరావతిలో గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హజ్ యాత్ర కోసం దరఖాస్తులు అన్నీ ఆన్లైన్ ద్వారా మాత్రమే స్వీకరించడం కోసం కేంద్రహజ్ కమిటీ దేశవ్యాప్త ప్రకటన చేయడం జరిగిందని తెలిపారు. ఇకపై గడువు పెంపుదల ఉండదని మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్