రాజధాని అమరావతిలో 'ఏఐ ప్లస్ క్యాంపస్' ఏర్పాటు చేయనున్నట్లు బిట్స్ విశ్వవిద్యాలయ కులపతి, పారిశ్రామికవేత్త కుమారమంగళం బిర్లా ఆదివారం ఒక సమావేశంలో తెలిపారు. స్మార్ట్, సుస్థిర మౌలిక సౌకర్యాలతో రెండుదశల్లో 7వేల మంది విద్యార్థులకు అవకాశం కల్పించేలా కేంద్రాన్ని తీర్చిదిద్దుతామని, 2027 నుంచి ప్రవేశాలు ప్రారంభిస్తామని వెల్లడించారు. మరోపక్క బిట్స్ అమరావతి క్యాంపస్ ఏర్పాటకు సీఆర్డీఏ 70 ఎకరాలు కేటాయించింది.