రాజధాని నగరాన్ని అతిపెద్ద లంగ్ స్పేస్ నగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అమరావతి ఇన్ నేచర్ అనే కాన్సెప్టుతో హరిత ప్రణాళికల్ని అమలు చేయాలని సూచించారు. గురువారం సచివాలయంలో అమరావతి బ్యూటిఫికేషన్, గ్రీన్-బ్లూ మాస్టర్ ప్లాన్ పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ముఖ్యమైన కూడళ్లను అత్యంత ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చిదిద్దేందుకు వీలుగా పచ్చదనాన్ని పెంపొందించాలని సీఎం స్పష్టం చేశారు.