రాజధాని ప్రాంతంలో బసవతారకం కాన్సర్ ఆసుపత్రి పనులు అతి త్వరలోనే ప్రారంభిస్తామని ఆసుపత్రి సీఈవో కృష్ణయ్య గురువారం నాడు తుళ్లూరులో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ. బసవతారకం ఆసుపత్రి స్థాపించినప్పటి నుంచి ఇప్పటికే సుమారుగా రెండున్నర లక్షల మందికి ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.