తుళ్లూరు: అగ్నిమాపక వాహనాలను ప్రారంభించిన సీఎం

అమరావతిలో అగ్నిమాపక శాఖ ఆధునీకరణలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన వాహనాలు, పరికరాలను ప్రారంభించారు. రూ. 252. 93 కోట్ల ప్రణాళికలో భాగంగా రూ. 33. 25 కోట్ల విలువైన వాహనాలు, పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. తొలి దశలో 25 అధునాతన అగ్నిమాపక వాహనాలు, 40 క్విక్ రెస్పాన్స్ వాహనాలు, 50 రబ్బర్ బోట్లు, 30 బీఏ సెట్ కంప్రెసర్లు కొనుగోలు చేశారు. ప్రజల ప్రాణరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, హై రైజ్ భవనాల దృష్ట్యా శాఖను మరింత బలోపేతం చేయాలని సీఎం సూచించారు.

సంబంధిత పోస్ట్