తుళ్లూరు: ఆగస్ట్ 2న సీఎం చేతుల మీదుగా 'అన్నదాత సుఖీభవ

అన్నదాత సుఖీభవ పథకం తొలి విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు అయింది. సూపర్‌ సిక్స్‌లో కీలక హామీ అయిన అన్నదాత సుఖీభవ పథకాన్ని ఆగస్టు 2న ప్రకాశం జిల్లా దర్శిలో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. 7000 రూపాయలను తొలి విడత సాయం కింద రాష్ట్రంలో అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలలో ప్రభుత్వం జమ చేయనుంది. అలాగే కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ యోజన నిధులు కూడా జమ కానున్నాయి. రాష్ట్రంలోని 46 లక్షల 50 వేల మంది రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ డబ్బును ప్రభుత్వం జమ చేయనుంది.

సంబంధిత పోస్ట్