తుళ్లూరు: వృద్ధురాలి అదృశ్యంపై ఫిర్యాదు

తుళ్లూరు మండలం నెక్కల్లు గ్రామానికి చెందిన పూజల శేషమ్మ (70) ఈ నెల 12 నుంచి కనిపించడం లేదని ఆదివారం సాయంత్రం ఆమె మనవడు అశోక్ తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శనివారం ఉదయం ఆమె గుంటూరు బస్సు ఎక్కి వెళ్లినట్టు స్థానికులు చెబుతున్నారని వివరించారు. ఈ నేపథ్యంలో తుళ్లూరు ఎస్సై కలగయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శేషమ్మ ఆచూకీ తెలిసిన వారు ఎవరైనా పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని సూచించారు.

సంబంధిత పోస్ట్