అమరావతి సచివాలయంలో రహదారులు, భవనాలు, రవాణా శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అతి తక్కువ వ్యయంతో ప్రజారవాణా అందుబాటులోకి రావాలని, దీనికి ఈవీ బస్సుల వినియోగం సరైన మార్గమని తెలిపారు. ఈవీ బస్సులకు కిలోమీటరుకు రూ. 72 వ్యయం అవుతోందని, ఛార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ స్టాండర్డైజేషన్ లాంటి అంశాలను పరిశీలించాలని సూచించారు. అన్ని కేటగిరీల్లోనూ ఏసీ ఈవీ బస్సులే ఉండాలని స్పష్టం చేశారు.