రాజధాని అమరావతిలో రైతుల భాగస్వామ్యంతో చెన్నైకి చెందిన వేదృతం గ్రూప్, డీఏవీ విధానంలో ఒక విద్యాసంస్థను ఏర్పాటు చేయనుంది. దీని కోసం గతంలో 3 ఎకరాల భూమిని కేటాయించారు. శాశ్వత భవనాలు పూర్తయ్యే వరకు తుళ్లూరులో తాత్కాలిక భవనంలో అకాడమీ కొనసాగుతుంది. మంగళవారం డీఏవీ స్కూల్స్ ప్రతినిధులు తుళ్లూరుకు హాజరయ్యారు. జూన్ 5 నుంచి అడ్మిషన్లు ప్రారంభమవుతాయని తెలిపారు.