రాజధాని ప్రాంతంలో చిన్మయ విద్యాలయ సంస్థ ఏర్పాటు కావడం సంతోషదాయకమని మంత్రి నాదెండ్ల మంగళవారం తెలిపారు. ఏపీ హైకోర్టు సమీపంలో జరిగిన ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 85 చిన్మయ విద్యాసంస్థలు ఉన్నాయని, చంద్రబాబు ప్రభుత్వం ఈ సంస్థకు 3 ఎకరాల భూమి కేటాయించిందని గుర్తు చేశారు. సంస్కృతి, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యను అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, ప్రస్తుతం 26 కోట్లతో ప్రారంభమై 50 కోట్లు వెచ్చించి ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు.