తుళ్లూరు: యువకుడి మృతి కేసులో నిందితుల విచారణ

2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలేనికి చెందిన ఎం. బుల్లిబాబు (33) వడ్డమానులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతడిని హత్య చేసి ఆత్మహత్యగా కొందరు చిత్రీకరిస్తున్నారంటూ స్థానికంగా విమర్శలు వచ్చాయి. ఆ ఘటనపై అప్పట్లో తుళ్లూరు పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మరోసారి తుళ్లూరు పోలీసులు ఆ కేసులోని నిందితులను శుక్రవారం అదపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం.

సంబంధిత పోస్ట్