లోక్‌సభలో అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ ఢిల్లీకి చేరుకున్నారు. తనకు స్వాగతం పలికిన టీడీపీ ఎంపీలను ఆయన అభినందించారు. అమరావతిని ఏకైక రాజధానిగా సుస్థిరపరిచే పార్లమెంట్ నిర్ణయం చారిత్రకమని కొనియాడారు. నేడు రాజ్యసభలో బిల్లు ఆమోద ప్రక్రియను ఆయన స్వయంగా వీక్షించనున్నారు.