అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఏజిఐసిఎల్ ఎండీ శ్రీనివాస్, ఇంజినీర్లు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ నెలలోనే పలు భవనాలు పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించడంపై చర్చ జరిగింది. అమరావతిలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల కోసం 4026 ఇళ్లు నిర్మిస్తున్నారు. నిర్మాణాలు పూర్తవుతున్న టవర్ల వద్ద మౌలిక సదుపాయాల కల్పనపై కూడా సమావేశంలో చర్చించారు.