తుళ్లూరు: 400 ఎకరాల భూ సేకరణకు త్వరలో నోటిఫికేషన్

రాజధాని అమరావతిలో రహదారుల నిర్మాణాలకు ఆటంకంగా ఉన్న మరో 400 ఎకరాల భూమికి త్వరలో భూ సేకరణ నోటిఫికేషన్ ఇస్తామని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. రాజధాని గ్రామం తుళ్లూరులో బుధవారం సాయంత్రం మౌలిక వసతుల కల్పనపై జరిగిన ప్రత్యేక గ్రామ సభలో స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్, సీఆర్డీఏ కమిషనర్ కె. కన్నబాబుతో కలసి మంత్రి పాల్గొన్నారు. ఈ భూ సేకరణతో అమరావతిలో రోడ్ల నిర్మాణం వేగవంతం అవుతుందని భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్