తుళ్లూరు మండలం ఊద్దండరాయిని పాలెం లో గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సభా వేదిక వద్ద ప్రజలతో మాట్లాడేందుకు ముఖ్యమంత్రికి అన్ని సదుపాయాలు కల్పించారు. ఈ సందర్భంగా రాజధాని ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ లకు కృతజ్ఞతలు తెలిపారు.