రాయపూడి గ్రామంలో గురువారం సాయంత్రం హైకోర్టు వైపు నుంచి వస్తున్న ఒక కారు రాయపూడి నుంచి వస్తున్న మరొక కారు గుద్దుకున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు వైపు నుంచి వస్తున్న కారు డ్రైవర్ కు స్వల్ప గాయాలు అవటంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి వచ్చిన పోలీసు సిబ్బంది అక్కడ ఉన్న ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. కాగా దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.