తుళ్లూరు: చికిత్స పొందుతూ కార్మికుడి మృతి

తుళ్లూరులో రాజధాని పనుల కోసం వచ్చిన బాబు వర్గీస్ (60) అనే కార్మికుడు బైక్ పైనుంచి పడి గాయపడి, చికిత్స పొందుతూ మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా సిద్దిక్ నగర్కు చెందిన వర్గీస్, దొండపాడు టిడ్కో గృహాల్లో అద్దెకు ఉంటూ బీమా కంపెనీలో ఫోర్మెన్గా పనిచేస్తూ రాజధాని పనులు చేస్తున్నాడు. దొండపాడు వెళుతుండగా బైక్ పైనుంచి కిందపడటంతో గాయాలయ్యాయి. స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్