రిటర్నబుల్ ప్లాట్లపై బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో తెదేపా అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన విధంగానే ఇప్పుడూ మంజూరు చేయాలని కోరుతున్నా బ్యాంకర్ల నుంచి స్పందన లేదు అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అవసరాల కోసం ప్లాట్లను తాకట్టు పెట్టి రుణం తీసుకుందామన్నా చుక్కెదురవుతోంది. అటు సేద్యం లేక, ఇటు కుటుంబ అవసరాల కోసం చేతిలో డబ్బుల్లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని రైతులన్నారు