సముద్రంలోకి వృధాగా పోతున్న నీటితో రిజర్వాయర్లు నింపాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులకు ఈ నీటిని తరలించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. గురువారం సచివాలయంలో సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు సమర్థ నీటి నిర్వహణపై జల వనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతీ నీటి బొట్టును సద్వినియోగం చేసుకునేలా ప్రణాళిక ఉండాలని స్పష్టం చేశారు.