గత కొద్ది రోజులుగా కృష్ణ నది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణా నదికి భారీ ఎత్తున నీరు చేరుతుంది. ఈ నేపథ్యంలో తుళ్లూరు మండలంలోని లంక గ్రామాలను ఖాళీ చేయవలసిందిగా ఇప్పటికే అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం నాటికి తుళ్లూరు మండలం ఉద్దండరాయనిపాలెం గ్రామంలో గల లంక ప్రాంతాలకు వరద నీరు చేరింది. దీంతో అధికారులు అంతా అప్రమత్తమై ప్రజలందరికీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.