ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత సోమవారం వెలగపూడిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఘాటుగా స్పందించారు. రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ను తీసుకురావడానికి రోజూ 18 గంటలు కష్టపడుతున్న వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తున్నారంటూ ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరికి ఆదర్శంగా ఉండాలి కానీ. ఇలాంటి పదాలు మాట్లాడకూడదని హితవు పలికారు.