వెలగపూడి అసెంబ్లీ వద్ద బుధవారం ఎస్సీ ఎస్టీ ఎంఎస్ఎమ్ఈ పారిశ్రామికవేత్తలు కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన చేపట్టారు. తమకు రావలసిన రాయితీలు వెంటనే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఆరు నెలలుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, 100% రాయితీలు ఇస్తామని చెప్పి కేవలం 20% మాత్రమే విడుదల చేశారని ఆరోపించారు. మిగిలిన 80% రాయితీలను వెంటనే విడుదల చేయాలని వారు కోరారు.