రాజధానిలో కార్మికులకు నిలిపివేసిన రాజధాని సామాజిక పెన్షన్ ప్రభుత్వం పునరుద్దించినందుకు పారిశుధ్య కార్మికులు తుళ్లూరులో గురువారం నాడు సీట్లు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నేత రవి మాట్లాడుతూ మేము చేసిన పోరాటానికి ప్రభుత్వం స్పందించి పెన్షన్లను పునరుదించడం ఆనందంగా ఉందని అన్నారు. ఇందుకు సహకరించిన ప్రభుత్వానికి, సీఆర్టీ అధికారులకు, ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు.